KDP: సింహాద్రిపురం సింగల్ విండో సొసైటీ అధ్యక్షుడిగా రాంగోపాల్ రెడ్డి ఎన్నికయ్యారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి, పారదర్శకతతో సేవలు అందిస్తూ, సింహాద్రిపురం సింగల్ విండోను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. సభ్యులందరికీ సమాన న్యాయం, సమగ్ర అభివృద్ధి, వ్యవసాయ రంగ పురోగతి తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.