NDL: ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తులూరు నుంచి చాగలమర్రికి వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక వైపు నుంచి లారీ ఢీకొంది. ట్రాక్టర్ యజమాని మహేశ్వర్ రెడ్డి (48) డ్రైవర్ వెంకటయ్య (32) గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 1033 ఆంబులెన్స్ లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.