WNP: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం వనపర్తి ఆర్టీసీ డిపోలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. SWF నేతలు కృష్ణ, నాగేశ్వర్, జేబీ స్వామిలు మాట్లాడుతూ.. కార్మికసంఘాలపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు ఎన్నికలు జరపాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.