ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డు కొత్తూరు నందు బుధవారం ఒంగోలు మాజీ పార్లమెంటు సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి 78వ జయంతి వేడుకలు టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు ఫిరోజ్ ఆధ్వర్యంలో మా గుంట సుబ్బరామిరెడ్డి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.