VZM: రైతు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పేర్కొన్నారు.పెద్ద తాడివాడలో ‘రైతన్నమీ కోసం’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పథకాలను అమలు చేసోందని, ప్రతి రైతు ప్రభుత్వ సదుపాయాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.