W.G: పోలియో రహిత సమాజం కోసం ఐదేళ్లలోపు చిన్నారులందరికీ చుక్కల మందు వేయించాలని మొగల్తూరు తహసీల్దార్ కె. రాజ కిషోర్ సూచించారు. ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం కేపీ పాలెం సౌత్ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా ప్రజలతో మాట్లాడి అవగాహన కల్పించారు.