ప్రకాశం: మార్కాపురంలోని తెలుగు బాప్టిస్ట్ టౌన్ చర్చ్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నారులు నృత్యాలు, యూత్, స్త్రీల సమాజం సభ్యుల పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. శాంతి, ప్రేమ బోధించిన యేసు బోధనలు మానవాళికి మంచి మార్గంలో నడిపించాయని ప్రసంగీకులు రెవ. డా. డానియల్ కుమార్ సందేశాన్ని అందించారు.