GNTR: గుంటూరు నగరపాలకసంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు నగర పర్యటనలో భాగంగా బుధవారం పాత గుంటూరు, యాదవ బజారు ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్డు, డ్రైన్ల ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరుండి ఆక్రమణలను సిబ్బందితో తొలగింపజేశారు. మురుగు పారుదల వ్యవస్థ, ట్రాఫిక్‌కి ఇబ్బందులు తలెత్తేటట్లు ఆక్రమణలు చేస్తే సహించేది లేదని కమిషనర్ హెచ్చరించారు.