KDP: దోమల వల్ల వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ప్రొద్దుటూరు మండలం చెన్నమరాజ పల్లెలో మంగళవారం రాత్రి ఫైలేరియా వ్యాధి సర్వే నిర్వహించారు. గ్రామంలో ఫైలేరియా వ్యాధి నిర్ధారణ గురించి 300 మంది నుంచి రక్త పోత నమూనాలను సేకరించారు. డెంగ్యూ, మలేరియా చికెన్ గున్యా వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.