కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ శివారులోని మైనారిటీ గురుకుల పాఠశాల-3లో డీఈఓ ఆదేశాల మేరకు ‘స్నేహిత’ కార్యక్రమంపై అవగాహన సదస్సు జరిగింది. ప్రిన్సిపల్ చంద్రమోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో మానసిక ధైర్యం, భద్రతపై అవగాహన పెంచే అంశాలపై చర్చించారు. ఈ సదస్సులో చామనపల్లి మెడికల్ అధికారి డా. ఫిరోజ్, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కమిటీ మెంబర్ ప్రియాంక పాల్గొన్నారు.