ఖమ్మం జిల్లాలో తాజాగా విడుదలైన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి 5 గ్రామ పంచాయతీలను అధికారులు మినహాయించారు. ఏన్కూరు మండలంలోని ఏన్కూరు, ఆరికాయలపాడు, జన్నారం, నాచారం, అలాగే పెనుబల్లి మండలం గౌరారంలో ఎన్నికలను నిలిపివేశారు. ఈ పంచాయతీలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించే విషయంపై కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.