KRNL: గోనెగండ్ల మండలం ఎన్నకండ్లలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోమేశ్వర్ రెడ్డి(52) ఇంట్లో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకున్న ఎకరా పొలంతో పాటు మరో ఎకరా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడని గ్రామస్థులు తెలిపారు. పంటలు సరిగా పండక, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు తీరక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.