ప్రకాశం: తర్లుపాడు మండలం లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ప్రాథమిక స్థాయి నుంచే రాజ్యాంగంపై అవగాహన పొందాలని హెచ్ఎం మౌలాలి విద్యార్థులకు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు,ఉపాధ్యాయులు రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.