MHBD: తొర్రూరు మండలం జీకే తండా ప్రాథమిక పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. కానీ పాఠశాలకు ప్రవేశ మార్గంలో గేటును ఏర్పాటు చేయలేదు .దీంతో విద్యార్థుల భద్రత పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలకు గేటును అమర్చాలని స్థానికులు కోరుతున్నారు.