ముంబై తాజ్ హోటల్‌పై ఉగ్రదాడి జరిగి నేటికి 17 ఏళ్లు(2008). ఈ దాడి కోసం ఉగ్రవాదులు సముద్రమార్గంలో ముంబైకి వచ్చి ఛత్రపతి శివాజీ టెర్మినల్, తాజ్ హోటల్, టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక గల్లీతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. నవంబర్ 26 నుంచి 29 వరకు జరిగిన దాడుల్లో 174 మంది మరణించగా.. 308 మంది గాయపడ్డారు. 2012లో కీలక నిందితుడైన కసబ్‌ను ఉరితీశారు.