ప్రస్తుత నవంబర్ నెల భారత మహిళా క్రీడాకారిణులకు చాలా స్పెషల్‌గా నిలిచిపోతుంది. ఎందుకంటే.. ఈ నెల 2న క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. అలాగే 23న అంధుల క్రికెట్ టీమ్ అరంగేట్ర T20 ప్రపంచకప్ విన్నర్‌గా నిలవగా.. 24న కబడ్డీ జట్టు విశ్వవిజేతగా అవతరించింది. ఈ ఏడాది ఆరంభంలోనూ(ఫిబ్రవరి 2) భారత మహిళా క్రికెటర్లు U19 T20 వరల్డ్ కప్ నెగ్గారు.