NDL: కార్తీక మాసంలో తొలిసారిగా రికార్డు స్థాయిలో శ్రీశైలం దేవస్థానానికి హుండీ ఆదాయం చేకూరింది. 33 రోజులలో శ్రీశైల మల్లన్నకు భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. రూ. 7,27,26,400 నగదు రాబడిగా లభించింది. 117 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారు, 7 కేజీల 230 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ నోట్లు లభించాయి.