NLR: నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చేజర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో అవగాహన పెంచే లక్ష్యంతో చిత్రలేఖన పోటీలను ఏర్పాటు చేశారు. డ్రాయింగ్ మాస్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.