NZB: జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బోధన్‌లోని ఎంపీడీవో కార్యాలయాన్ని నిన్న ఆకస్మికంగా సందర్శించారు. జిల్లా పర్యటనలో భాగంగా బోధన్ ప్రాంతంలో కలెక్టర్ పర్యటించారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సన్నద్ధతను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎంపీడీవో కిషోర్ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.