కృష్ణా: జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద మల్లవల్లి రైతులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇప్పించాలంటూ ఇప్పటికే 20 సార్లు వచ్చినా పరిష్కారం దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీన ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, 10 రోజుల్లో న్యాయం చేస్తామని నేతలు హామీ ఇచ్చినా 15 రోజులు గడిచినా స్పందన లభించలేదని రైతులు ఆరోపించారు.