AP: గుండెనొప్పి వచ్చిన వారికి స్టెమీ విధానంలో అందిస్తున్న వైద్యం వల్ల 2024 జూన్ 1 నుంచి ఈనెల 15 వరకు 3,027 మంది ప్రాణాలు నిలిచాయని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో 238 ఆసుపత్రుల్లో టెనెక్టెప్లేస్ ఇంజెక్షన్‌ను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడంతో ఎంతోమంది ప్రాణాలు నిలుస్తున్నాయని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్ ధర రూ.45 వేల వరకు ఉంటుందని చెప్పారు.