నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటీ పోటీల్లో అండర్ 11,14 విభాగాల్లో బుచ్చి పాలెం పట్టణంలోని రెయిన్ బో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ పోటీల్లో పాల్గొన్న 10 మంది విద్యార్థులు గోల్డ్, సిల్వర్ మెడల్‌ను సాధించారు. ఈ మేరకు పాఠశాలలో డైరెక్టర్ చిట్టిబాబు, పిడి భీమ తాటి రమణయ్య విద్యార్థులను సత్కరించి అభినందించారు. 7మంది విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.