W.G: రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా భీమవరం గునుపూడిలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ గోపి మూర్తి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా పరిపాలించాలి, ప్రజలకు ఏ విధమైన హక్కులు కల్పించాలని అనే ఆలోచనతో అంబేద్కర్ రాజ్యాంగం రాయటం జరిగిందని అన్నారు. UTF జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు పాల్గొన్నారు.