RR: జిల్లా పరిధి కొత్తగూడ చెరువు గార్బేజితో నిండిపోతుందని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాల్లో డ్రైనేజీ నీరు పొంగిపొర్లుతుందని, మరోవైపు రోడ్ల పై గార్బేజి వదిలేసి వెళుతున్నారని, దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా చెరువును క్లీన్ చేయాలని అధికారులను కోరుతున్నారు. గతంలో చెప్పిన పట్టించుకోలేదన్నారు.