E.G: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.