AP: మాజీ సీఎం జగన్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఉద్యోగి జీతం తీసుకుని పనిచేయకపోవడం తప్పు అయినప్పుడు.. ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలంటూ ప్రశ్నించారు. దీనిపై పెద్దలే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అందరూ కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. రాజకీయ నాయకుల్లో కుతంత్రాలుంటాయని వ్యాఖ్యానించారు.