KMM: ఏన్కూర్ మండలం రేపల్లెవాడ గ్రామంలో పాముకాటుకు గురై కాళింగు రాములు మృతి చెందారు. కాగా మంగళవారం వారి పార్థివదేహానికి వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ధర్మా నాయక్, షేక్ బాజీ, షేక్ చాంద్ పాషా, సుధాకర్ ఉన్నారు.