సత్యసాయి: హిందూపురంలో చెత్తను సేకరించే ఎలక్ట్రానిక్ ఆటోలను మున్సిపల్ ఛైర్మన్ డీఈ రమేశ్ కుమార్ ఇవాల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెత్తను ఆటోల ద్వారా సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తామని తెలిపారు. ప్రజలు ఎవరు చెత్తను మురికి కాలువలో, రహదారుల్లో పడవేయకుండా నేరుగా ఆటోలకు అందించాలన్నారు. తద్వారా పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని పేర్కొన్నారు.