ASR: పాడేరు ప్రభుత్వ ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిరుద్యోగ యువతకు 12 ప్రముఖ కంపెనీలతో ఈ నెల 28న మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారెవరైనా ఈ మేళాలో పాల్గొనడానికి అర్హులన్నారు.