AP: బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌కు మాతృవియోగం కలిగింది. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తల్లి చింతకుంట రత్నమ్మ(83).. ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతిచెందారు. ఆమె మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలిపారు.