కోనసీమ: అమలాపురం పట్టణంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి స్థలపురాణం చూసుకుంటే సుమారు 950 సంవత్సరాల క్రితం చోళులు, తూర్పు చాళుక్యులు కాలంలో ఆలయ నిర్మాణం జరిగిందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి. చోళులు వారి నిర్మాణ శైలిలో ఈ ఆలయం నిర్మించారని తెలుస్తోంది. బుధవారం జరిగే షష్టి మహోత్సవాలకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ పేరూరు విజయలక్ష్మి తెలిపారు