KDP: ఒంటిమిట్ట మండలంలోని పెద్దకొత్తపల్లిలో ఇవాళ ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెదేపా నేత ఎస్.వి.రమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పలు పూజా కార్యక్రమాలతో పాటు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పోటీలను పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.