AP: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఈరోజు విద్యార్థుల మాక్ అసెంబ్లీ జరగనుంది. మొత్తం 175 మంది సభ్యులు, సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు 26మంది మంత్రులు, స్పీకర్, ప్రతిక్షనేత ఉంటారు. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు ఈ మాక్ అసెంబ్లీ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.