SKLM: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలుపై మాట్లాడుతూ.. కొన్ని ప్రాంతాలలో ప్రక్రియ మందకొడిగా ఉందన్నారు.