E.G: జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.