MHBD: ఇనుగుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కోమటిపల్లి, చిన్నముప్పారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కష్టాన్ని చూసి చలించిన భూక్యా శోభన్ బాబు 60 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ సంజీవరెడ్డి,ఎస్సై కరుణాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంఈవో రూపారాణి పాల్గొన్నారు.