MNCL: జనవరి 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు పలు రైళ్లు రద్దు కానున్నాయి. మందమర్రి రైల్వే స్టేషన్ వద్ద మూడో లైన్ పనుల కారణంగా సిర్పూర్ (T)-కరీంనగర్ మెమూ, కాజీపేట-సిర్పూర్ కాగజ్నగర్ ప్యాసింజర్, కాజీపేట-బల్లార్ష రామగిరి ప్యాసింజర్, సిర్పూర్ కాగజ్నగర్ ఎక్స్ ప్రెస్ నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు దారి మళ్లించనున్నారు.