SRPT: కోదాడ డీఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ శ్రీధర్ రెడ్డి సివిల్ సప్లై ఆఫీస్కు బదిలీ కాగా ఆయన స్థానంలో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..నేర నియంత్రణ ప్రజల భద్రత, శాంతి పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.