E.G: నల్లజర్లలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవ కార్యక్రమాలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. స్వామివారికి కళ్యాణం నిర్వహించి ఉదయం భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుందని రాయుడు విజయ్ కుమార్ తెలిపారు.ఈ మహోత్సవాలు ఈ రోజు మొదలుకొని వచ్చే నెల 2వ తేదీ వరకు కొనసాగుతాయని ఆయన తెలిపారు.