CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో పెంచల కిషోర్ పదవీ కాలాన్ని మరో ఏడాదికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెవెన్యూ శాఖ నుంచి దేవదాయ శాఖకు డిప్యుటేషన్‌పై వచ్చారు. వచ్చే నెల 6వరకు ఈవోగా కొనసాగేందుకు వ్యవధి ఉంది. ఈక్రమంలో మరో ఏడాది కాలపరిమితి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.