AKP: అచ్యుతాపురం మండలంలోని ఇరువాడ శివారు చిట్టిబోయినలో మంగళవారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. 40 ఏళ్ల గీత కార్మికుడు దొడ్డి నూకరాజు, రోజూ మాదిరిగానే కల్లు గీతకు తాటిచెట్టు ఎక్కాడు. కల్లు దించుతుండగా, చెట్టు ఎక్కడానికి ఉపయోగించిన మోకు తెగిపోవడంతో అతను కిందపడి మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.