నంద్యాల జిల్లా బనగానపల్లెను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు సీఎం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. డోన్ రెవెన్యూ డివిజన్ నుంచి విభజించి బనగానపల్లె, అవుకు, కోవెలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో కొత్తగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.