GNTR: వసంతరాయపురం దీనదయాల్ కాలనీకి చెందిన ఆందోళనమ్మ తన కూతురు నాగమణి, మనవరాలు లక్ష్మీప్రియా అదృశ్యమైనట్లు అరండల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్తతో విభేదాల కారణంగా నాగమణి తన వద్దే ఉంటూ పూలు అమ్ముకునేదని చెప్పింది. ఈ నెల 18న నాగమణి తన కూతురుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.