SRCL: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామంలో మహమ్మాహి మాత దేవి వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రోజున అమ్మవారిని ప్యాక్స్ ఛైర్మన్, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రేణుక కిషన్, మాజీ ఎంపీటీసీ ఎల్లగందుల నరసింహులు, మొగులోజి కిష్టయ్య, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.