కృష్ణా: ఆకునూరు ఫ్లై ఓవర్ వద్ద రోడ్డు భద్రత ప్రమాదాల నివారణకు ఎస్సై సురేష్ కుమార్ నిన్న వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులందరూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి, తక్కువ వేగంతో వాహనాలు నడపాలని, తద్వారా తమ గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకోవాలని సూచించారు.