PPM: నెలవారీ నేరసమీక్షలో భాగంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి కాన్ఫరెన్స్ హాల్ పోలీసు అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్.డీ.పీ.ఎస్.కేసుల్లో నేరస్థుల ఆస్తులను ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలనే అంశాలపై ఎస్పీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విధుల్లో నిబద్ధత పాటించాలన్నారు.