ప్రకాశం: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆదేశించారు. ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో పురోగతిపై ఆయన సమీక్షించారు. సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నందున ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.