VZM: బెల్ట్ షాపుల నిర్వహణ, నాటు సారా తయారీ కేసుల్లో వేపాడ మండలానికి చెందిన 21 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఎస్సై వీఎన్ రాజా తెలిపారు. కొత్తవలస తహసీల్దార్ రాములమ్మ సమక్షంలో మంగళవారం బెల్ట్ షాపుల కేసుల్లో 17 మంది నాటు సారా తయారీ కేసుల్లో నలుగురు బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.