కరీంనగర్ రూరల్ మండలం చెర్లబుత్కూర్ గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేసుకుని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.