SKLM: మానసిక వికాసానికి క్రీడలు ఒక ఔషధం అని నరసన్నపేట నియోజకవర్గ సమన్వయకర్త అర్చన అన్నారు. పోలాకి M ఈదులవలస జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గిగ్స్ ఆటల పోటీల ముగింపు కార్యక్రమంలో మంగళవారం ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మనిషి చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, ఆటలు, పాటలు వంటివి అలవర్చుకోవాలి అని అన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు.